బన్నీ సుకుమార్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్

బన్నీ సుకుమార్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. బన్నీ-సుకుమార్ కాంబోలో 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈనెల 11న లాంచ్ అవ్వబోతోంది. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని తెలుస్తోంది. ఇక కథలో ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ హైలైట్గా మారబోతోందని, బన్నీ ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన మరియు ఛాలెంజింగ్ పాత్ర పోషించబోతున్నాడు. తెలుస్తోంది ఇప్పటికే తిరుపతి లో షూటింగ్ కోసం కొన్ని మంచి లొకేషన్లను ఫైనలైజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు సుకుమార్. మహేష్ బాబు వద్దన్న ఈ స్క్రిప్టుని బన్నీ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories