మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయనున్న త్రివిక్రమ్

మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయనున్న త్రివిక్రమ్
x
Highlights

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ గా మారిన చాలాకాలం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా డిజాస్టర్ గా మారిన చాలాకాలం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 'అ' సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తప్ప త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అతడు', 'అత్తారింటికి దారేది', ఈ మధ్యనే విడుదలైన 'అరవింద సమేత' సినిమాలు సూపర్ హిట్ లుగా మారాయి.

ఇప్పుడు అదే 'అ' సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బన్నీ సినిమా కోసం కూడా 'అ' అక్షరంతో మొదలయ్యే టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 'అలకనంద' అనే పేరును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ హీరోగా నటించిన 'బద్రీనాథ్' సినిమాలో హీరోయిన్ తమన్నా పేరు 'అలకనంద'. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. మరి ఇప్పుడు ఆ పేరుతో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ మరియు యు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories