ఎన్టీఆర్ విషయంలో హర్ట్ అయిన బుచ్చి బాబు...

Buchi Babu Sana - Jr NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు...

Shireesha
Published on: 23 May 2022 1:15 PM IST
Buchi Babu Sana Hurts by Jr NTR Movie with Him | Tollywood Gossips
X

ఎన్టీఆర్ విషయంలో హర్ట్ అయిన బుచ్చి బాబు...

Buchi Babu Sana - Jr NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోందని చెప్పిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.నిజానికి ఎన్టీఆర్ ఇంకొక సినిమా గురించి కూడా ప్రకటించాల్సి ఉంది.

ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక సినిమాని సైన్ చేశారు కానీ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అసలు "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమానే పట్టా లెక్కిస్తారు అని అందరూ అనుకున్నారు కానీ తారక్ మాత్రం ఈ సినిమాని పక్కన పెట్టి మిగతా సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈనేపథ్యంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ విషయంలో కొంచెం హర్ట్ అయినట్లు తెలుస్తోంది. "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది ప్రస్తుతం ఉన్న ఇమేజ్ మరియు మార్కెట్ కి స్టార్ డైరెక్టర్లతో నే సినిమా చేయాలని అందుకే బుచ్చిబాబు సైడ్ చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఈ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Shireesha

Shireesha

Next Story