Jr NTR: బుచ్చిబాబు తో ఎన్టీఆర్ మూవీ..ఎప్పుడంటే..!

Buchi Babu Sana Next Movie with Young Tiger Jr NTR | Tollywood New Movies
x

బుచ్చిబాబు, ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

NTR: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చి బాబు సనా.

NTR: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చి బాబు సనా. తన మొదటి సినిమాతో స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు ఈ డైరెక్టర్. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

బుచ్చి బాబు సనా తన తదుపరి ప్రాజెక్ట్‌ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయనున్నాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రారంభం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ జూలై లేదా వచ్చే ఏడాది తరువాత ప్రారంభమవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'ఆర్ఆర్ఆర్' తో బిజీగా ఉన్నారని తెలిసిందే. ఈ ప్రాజెక్టు అయిపోగానే ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ ప్రాజెక్టుతో బిజీగా ఉండనున్నాడు ఎన్టీఆర్. #NTR30 తరువాతే బుచ్చిబాబు సినిమా మొదలుకానుంది.

ఈ లోగా బుచ్చి బాబు స్క్రిప్ట్‌తో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రానుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories