Jr NTR-Buchi Babu: బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమా కోసం తేదీ ఖరారు

Buchi Babu Has Finalized the Date for the NTR Movie | Telugu Online News
x

బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమా కోసం తేదీ ఖరారు

Highlights

Jr NTR-Buchi Babu: బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమా కోసం తేదీ ఖరారు

Jr NTR-Buchi Babu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ బుచ్చి బాబు డైరెక్షన్ లో మరో సినిమా సైన్ చేశారు. "ఉప్పెన" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు రెండవ సినిమాకే ఎన్టీఆర్ తో కలిసి పనిచేయబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక కబడ్డీ ఆటగాడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ను ఏప్రిల్ 11 న వెలువడనుంది. ఈ సినిమా కోసం "పెద్ది" అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్యాన్ ఇండియన్ రేంజి లో విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీ లో కూడా విడుదల కాబోతోంది. బుచ్చి బాబు ఈ సినిమాకు కోసం మంచి స్క్రిప్ట్ నీ తయారు చేశారట. కొరటాల శివ తో సినిమా తరువాత ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories