Breaking News: ప్రముఖ సినీగేయ రచయిత వెన్నలకంటి కన్నుమూత

Breaking News: ప్రముఖ సినీగేయ రచయిత వెన్నలకంటి కన్నుమూత
x
Highlights

ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. వెన్నెలకంటి తనయుడు...

ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. వెన్నెలకంటి తనయుడు శశాంక్ కూడా సినీ గేయ రచయతగానే కొనసాగుతున్నారు. ఇక, వెన్నెలకంటి ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు. ఆయన పాటల్లో ప్రాస ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు.

అంత్య ప్రాసతో పాటలు రాయడంలో వెన్నెలకంటి దిట్ట. ఆయన రాసిన పాటల్లో ఎక్కువగా అంత్య ప్రాస కనిపిస్తుంది. అలాగే, ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వెన్నెలకంటి పాటలు రాశారు. కొన్ని సినిమాలకైతే మొత్తం పాటలన్నీ వెన్నెలకంటి రాయగా ఆ మూవీస్‌ అన్నీ బంపర్ హిట్ కొట్టాయి.

సినీ గేయ రచయితగానే కాకుండా... డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్ గా పేరు పొందారు.. తమిళ సినిమాల తెలుగు వెర్షన్ కు ఆయనే స్క్రిప్ట్ రైటర్ తెలుగులో తొలి డైరక్ట్ సినిమా అందాల రాక్షసిలో ఆయన రెండు గీతాలు రాశారు. అందులో ఒక పాట కూడా పాడారు. అలాగే మూడు ముక్కల్లో అనే సినిమాలో నటించారు కూడా. మురళీ కృష్ణుడు, ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి, టక్కరి దొంగలాంటి సూపర్ హిట్ మూవీస్ కు పాటలందించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories