సమంత కి షాక్ ఇస్తున్న బ్రాండింగ్ ఏజెన్సీ

సమంత కి షాక్ ఇస్తున్న బ్రాండింగ్ ఏజెన్సీ

Rama Rao
Updated on: 25 July 2022 7:01 PM IST
Branding Agency Giving Shock to Samantha | Tollywood News
X

 సమంత కి షాక్ ఇస్తున్న బ్రాండింగ్ ఏజెన్సీ

Samantha: విడాకుల తర్వాత స్టార్ బ్యూటీ సమంత రుత్ ప్రభు కేవలం కెరీర్ మీదే బాగా ఫోకస్ చేస్తోంది. ఒకవైపు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు సైన్ చేసిన ఈ భామ అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ మధ్యనే ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో అయిన "కాఫీ విత్ కరణ్" కి గెస్ట్ గా వెళ్లిన సమయంతో తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

అయితే "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట తరువాత సమంతకి బాలీవుడ్ లో కూడా బీభత్సమైన క్రేజ్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈమెకు బోల్డు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా వచ్చి పడుతున్నాయి. త్వరలోనే సమంత నాలుగు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా వరకు టీవీ కమర్షియల్స్ లో నటించే అవకాశం కూడా సమంతా కి వస్తోంది.

ప్రస్తుతం తన కరియర్ పీక్ లో ఉన్న సమంత పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ లు కూడా చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం సమంతా బ్రాండింగ్ ఏజెన్సీ వారు సమంత నుంచి బోలెడంత రెమినరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి బ్రాండింగ్ ఏజెన్సీలు సెలబ్రిటీల నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని మిగతా భారీ మొత్తాన్ని నిర్మాణ సంస్థల నుంచి తీసుకుంటారు కానీ సమంత బ్రాండింగ్ ఏజెన్సీ మాత్రం రివర్స్ లో చేస్తూ సామ్ నుండి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ షాకిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story