కాసేపట్లో మీడియా ముందుకు జూనియర్ ఎన్టీఆర్.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై రాజకీయ రచ్చ

Brahmastra Event with Jr NTR Cancelled
x

కాసేపట్లో మీడియా ముందుకు జూనియర్ ఎన్టీఆర్.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై రాజకీయ రచ్చ

Highlights

Jr NTR: కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రద్దు అయ్యింది.

Jr NTR: కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రద్దు అయ్యింది. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. వినాయక చవితి సందర్భంగా సిబ్బంది అంతా బందోబస్తులో బిజీగా ఉన్నారని.. అందువల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సెక్యూరిటీ కల్పించడం సాధ్యం కాదంటూ రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈవెంట్‌కు వచ్చే క్రౌడ్‌ను కంట్రోల్ చేయలేమని స్పష్టం చేశారు. అయితే బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంపై రాజకీయ రచ్చ మొదలైంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ రానున్నారు. అందువల్లే ఆ ఈవెంట్‌ రద్దు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌ గా రానున్న బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై మాట్లాడేందుకు కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో బ్రహ్మాస్త్ర టీమ్‌ కూడా ప్రెస్ మీట్ నిర్వహించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories