Brahmanandam: ఎమోషనల్ పాత్రలో కనిపించనున్న బ్రహ్మానందం

Brahmanandam will Appear in an Emotional Role in Ranga Maarthaanda Movie
x

ఎమోషనల్ పాత్రలో కనిపించనున్న బ్రహ్మానందం

Highlights

Brahmanandam: బ్రహ్మానందానికి అలాంటి పాత్ర ఇచ్చిన కృష్ణవంశీ

Brahmanandam: ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఇప్పుడు "రంగమార్తాండ" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరాటీలో సూపర్ హిట్ అయిన "నటసామ్రాట్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సినిమా చూసి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిన కృష్ణవంశీ ఎలాగైనా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృష్ణవంశీ ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. నానా పటేకర్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇక తెలుగు వర్షంలో ప్రకాష్ రాజ్ ఆ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక "నటసామ్రాట్" సినిమాలో నానా పాత్ర తర్వాత స్నేహితుని పాత్రలో కనిపించిన ఒక స్టేజి ఆర్టిస్ట్ విక్రమ్ గోఖలే కి కూడా అంతే మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకున్నారు అనే విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ బ్రహ్మ గా పేరున్న బ్రహ్మానందం అలాంటి సీరియస్ ఎమోషనల్ పాత్ర చేసి చాలా కాలమైంది. అలాంటి పాత్రలో బ్రహ్మానందాన్ని ఎంచుకోవడం నిజంగా చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ పాత్ర కోసం బ్రహ్మానందం గడ్డం కూడా పెంచారు. నిజానికి ఒక సీనియర్ నటుడు కృష్ణ వంశీ కి ఫోన్ చేసి ఆ పాత్ర తాను చేస్తానని రేమ్యూనరేషన్ కూడా అవసరం లేదని చెప్పారట. కానీ కృష్ణవంశీ మాత్రం బ్రహ్మీ నీ మాత్రమే ఆ పాత్రలో చూస్తున్నాను అని అన్నారట. మరి ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర మరియు నటన ఎలా ఉండబోతున్నాయి అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories