బ్రహ్మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే

బ్రహ్మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే
x
Highlights

యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమాని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్ ల వల్ల ఒకే విషయంపై ఒక్కో...

యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమాని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్ ల వల్ల ఒకే విషయంపై ఒక్కో చానల్ వారు ఒక్కో విధంగా చెబుతారు. అందులో ఏది నమ్మాలి అనేది నెటిజన్లకు కష్టంగా మారింది. చిన్న హీరో నుంచి పెద్ద సీనియర్ స్టార్ ల వరకు అందరి విషయాల్లోనూ బోలెడు పుకార్లు వింటూనే ఉంటాం. కానీ వాటిల్లో నిజానిజాలు మాత్రం అందరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ఇరుక్కున్న ఒక సీనియర్ స్టార్ బ్రహ్మానందం.

ఈ మధ్యనే హార్ట్ సర్జరీ జరిగిన బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బ్రహ్మానందం ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి పలు కమెడియన్లు మరియు హీరోలు కూడా వచ్చి బ్రహ్మీని పరామర్శించారు. స్టార్ హీరో అల్లు అర్జున్, స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సత్య కలిసి ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలు చూస్తే బ్రహ్మీ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఏ ఛానల్ వారు ఎన్ని విధాలుగా వార్తలు పుట్టించినప్పటికీ బ్రహ్మీ ఆరోగ్యం కుదుటపడుతుందని ఫాన్స్ మాత్రం సంతోషంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories