Brahmanandam: మళ్లీ నడుస్తున్న బ్రహ్మీ హవా

Brahmanandam: వరుస సినిమాలతో అలరించబోతున్న బ్రహ్మానందం

admin1
Published on: 8 Dec 2021 12:46 PM IST
Brahmanandam Gave Clarity about His Next Films
X

వరుస సినిమాలతో అలరించబోతున్న బ్రహ్మానందం (ఫైల్-ఫోటో)

Brahmanandam: కేవలం బ్రహ్మానందం కామెడీ కోసమే కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాలకి వెళ్తారు అనడంలో అతిశయోక్తి లేదు. హాస్యబ్రహ్మ గా పిలవబడే బ్రహ్మానందం ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ తనదైన శైలిలో కామెడీని పండిస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు.

అయితే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ మాత్రమే సినిమాలో కనిపిస్తున్నారు బ్రహ్మానందం. ఈ ఏడాది మొదట్లో "అల వైకుంఠ పురం లో" సినిమా తో ప్రేక్షకుల్ని అలరించిన బ్రహ్మానందం తాజాగా ఇప్పుడు వచ్చే ఏడాది వరుస సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించబోతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మానందం తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మొదట్లో "భీమ్లా నాయక్" సినిమాలో కనిపించబోతున్నట్లు గా బ్రహ్మానందం తెలిపారు. ఇక ఆ తర్వాత రంగమార్తాండ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు బ్రహ్మానందం.

శర్వానంద్ హీరోగా ఒక సినిమా మరియు నితిన్ హీరోగా ఒక సినిమా కూడా సైన్ చేసినట్లు తెలిపారు బ్రహ్మీ. ఈ ఏడాది మొదట్లో కనిపించిన బ్రహ్మానందం వచ్చే ఏడాది మాత్రం చాలా సినిమాలతో ప్రేక్షకులకి కామెడీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story