Ram20: బోయపాటి డైరెక్షన్ లో రామ్?

Ram20: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి తన 19 సినిమాతో బిజీ గా ఉన్నారు.

Venkata Chari
Published on: 22 March 2021 5:24 PM IST
Boyapati to Direct Hero Ram?
X

హీరో రామ్ (ఫొటో హన్స్ ఇండియా)

Ram20: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి తన 19 సినిమా చిత్రీకరణలో బిజీ గా ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరో రామ్ తో రొమాన్స్ చేసేందుకు ఉప్పేన ఫేమ్ కృతి శెట్టి సిద్ధమయ్యారు. తాజాగా రామ్ 20వ సినిమా పై టాలీవుడ్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

బోయపాటి శ్రీను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం హీరో రామ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తన స్క్రిప్ట్ ను వినిపించేందుకు హీరో రామ్ ను చాలాసార్లు కలిశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ యంగ్ హీరో సైన్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును "బీబీ3" నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారని టాక్.

ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నందమూరి బాలకృష్ణతో తీస్తున్న 'బీబీ3' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 28 న రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత రామ్, బోయపాటి జతకట్టనున్నారని సమాచారం.

Venkata Chari

Venkata Chari

Next Story