Boyapati Srinu: బాలయ్య కాదు.. బాలీవుడ్ 1000 కోట్ల హీరోతో బోయపాటి సినిమా?

Boyapati Srinu
x

Boyapati Srinu: బాలయ్య కాదు.. బాలీవుడ్ 1000 కోట్ల హీరోతో బోయపాటి సినిమా?

Highlights

Boyapati Srinu: టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో బిగ్ హిట్స్ అందుకున్న బోయపాటి.. ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నాడనే న్యూస్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

Boyapati Srinu: టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో బిగ్ హిట్స్ అందుకున్న బోయపాటి.. ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నాడనే న్యూస్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల ‘అఖండ’ సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ తాండవం’ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. దాంతో బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనే దానిపై సినీ అభిమానుల్లో ఫోకస్ పెరిగింది.

మొదట మరోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా ఖరారైందన్న టాక్ సినీ ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలు చూస్తే.. ఆ కాంబినేషన్ ఇప్పట్లో సాధ్యపడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ భారీ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. దీంతో బోయపాటి–బాలయ్య ప్రాజెక్ట్ కొంతకాలం వాయిదా పడినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను దృష్టి బాలీవుడ్‌పై పడిందన్న సమాచారం తెలుస్తోంది.

తాజా టాక్ ప్రకారం.. బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇటీవల ముంబై వెళ్లిన బోయపాటి.. రణవీర్‌కు ఒక పవర్‌ఫుల్ మాస్ కథను వినిపించినట్టు తెలుస్తోంది. రణవీర్ ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతుండగా.. సమ్మర్‌లో విడుదల కానున్న ‘ధురంధర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలాంటి దశలో బోయపాటి శ్రీను కథకు రణవీర్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అది బోయపాటికి బాలీవుడ్‌లో ఒక భారీ బ్రేక్‌గా మారడం ఖాయం. మరోవైపు రణవీర్ కూడా బోయపాటి లాంటి మాస్ దర్శకుడితో రగ్డ్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే.. టాలీవుడ్ మాస్ స్టైల్ బాలీవుడ్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories