Boyapati Srinu: ఇద్దరు హీరోలకి స్క్రిప్ట్ రెడీ చేసిన బోయపాటి

* అల్లు అర్జున్ లేదా రామ్ అంటున్న బోయపాటి

admin1
Updated on: 12 Dec 2021 1:01 PM IST
Boyapati Srinu Planning to do Movie With Allu Arjun or Ram
X

అల్లు అర్జున్ లేదా రామ్ అంటున్న బోయపాటి

Boyapati Srinu: "వినయ విధేయ రామ" సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా విడుదలైన "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. "సింహా", "లెజెండ్" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్లో విడుదలైన మూడవ సినిమాగా "అఖండ" కూడా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక బోయపాటి తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తి అభిమానులలో కలిగింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరియు రామ్ పోతినేని ల కోసం రెండు ఆసక్తికరమైన స్క్రిప్టును రెడీ చేశారట బోయపాటి.

అయితే రామ్ తో సినిమా కోసం బోయపాటి 40 కోట్ల బడ్జెట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. చిట్టూరి శ్రీనివాస రావు మొదట ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. కానీ హీరో రామ్ పైన అంత బడ్జెట్ పట్టడానికి అంతగా ఆసక్తి చూపించక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక బోయపాటి తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు ఖచ్చితంగా ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వస్తారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

admin1

admin1

Next Story