Boyapati Srinu: మరొకసారి బాలయ్యతో బోయపాటి కాంబో

Boyapati Srinu: మళ్లీ బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమైన బోయపాటి

admin1
Updated on: 7 Dec 2021 8:00 PM IST
Boyapati Srinu Has Also Planned His Next Film With  Balakrishna
X

మళ్లీ బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమైన బోయపాటి(ఫైల్-ఫోటో)

Boyapati Srinu: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈమధ్యనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా "సింహా" సూపర్ హిట్ అయింది. రెండవ సినిమా "లెజెండ్" కూడా బ్లాక్బస్టర్ గా మారింది. ఇక తాజాగా వీరి కాంబో లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". విడుదలైన మొదటి రోజునుండి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఇక తాజా సమాచారం ప్రకారం బాలయ్య మరియు బోయపాటి మరొకసారి చేతులు కలపబోతున్నరని తెలుస్తోంది. బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా కూడా బాలయ్య తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అఖండ తో వీరి కాంబో కి హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి. మరి వీరి కాంబో లో వచ్చే 4వ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story