Tollywood News: పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్న బన్నీ డైరెక్టర్

Tollywood News: అయితే పవన్ కళ్యాణ్ కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు...

admin1
Updated on: 2 Jan 2022 3:43 PM IST
Boyapati Srinu is Going to do Film with Power Star Pawan Kalyan | Tollywood News
X

Tollywood News: పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్న బన్నీ డైరెక్టర్

Tollywood News: మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను ని మించిన డైరెక్టర్ తెలుగు లో లేరు. ఈ మధ్యనే విడుదలైన "అఖండ" సినిమాతో ఈ విషయాన్ని మరొక సారి నిరూపించుకున్నారు బోయపాటి. ప్రస్తుత జనరేషన్ లో సీనియర్ హీరోల ని హ్యాండిల్ చేయగల ప్రతిభ బోయపాటికి మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

"సరైనోడు" బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ బోయపాటి కాంబో లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. "పుష్ప" షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ గ్యాప్ లో బోయపాటి శ్రీను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు పక్కనపెడితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవేళ బోయపాటి స్క్రిప్ట్ కి ఓకే చెప్పినప్పటికీ ఈ సినిమా పట్టలెక్కడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా బోయపాటి సినిమాల్లో హీరోలకు మాస్ పాత్రలు ఉంటాయి. అలాంటి మాస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించడానికి సిద్ధం అవుతున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story