బాలకృష్ణ తనయుడితో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్

నందమూరి మోక్షజ్ఞ తో సినిమా చేయబోతున్న బోయపాటి శ్రీను

admin1
Published on: 14 Dec 2021 5:20 PM IST
Boyapati Srinu is Going to do a Movie with Mokshagna Teja
X

నందమూరి మోక్షజ్ఞ తో సినిమా చేయబోతున్న బోయపాటి శ్రీను

Boyapati Srinu: నందమూరి అభిమానులు అందరూ నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరో అవుతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి తదుపరి సినిమా ఎవరితో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తో సినిమా చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

"సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణతో మూడు హిట్ సినిమాలను అందించిన బోయపాటి ఇప్పుడు బాలకృష్ణ తనయుడు తో కూడా ఓ సినిమా చేయబోతుండటం తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్ బి కే ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

admin1

admin1

Next Story