Boyapati Srinu: మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నా "అఖండ" డైరెక్టర్

Boyapati Srinu: బాలకృష్ణ తర్వాత మెగాస్టార్ అంటున్న బోయపాటి

admin1
Published on: 6 Dec 2021 3:56 PM IST
Boyapati Srinu Going to Make a Movie with Megastar Chiranjeevi
X

మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నా "అఖండ" డైరెక్టర్ ( ఫైల్ ఫోటో )

Boyapati Srinu: "వినయ విధేయ రామ" సినిమా డిజాస్టర్ అయిన తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలంటే చాలా మంది హీరోలు భయపడ్డారు. కానీ ఇప్పుడు "అఖండ" సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో స్టార్ హీరోలు సైతం బోయపాటితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి బోయపాటి తో సినిమా చేయాలని అనుకుంటున్నారట.

"అఖండ" సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో బోయపాటి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి తదుపరి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారట.

అతి తొందర్లోనే ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.

admin1

admin1

Next Story