Akhanda 2: అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. కాన్సెప్ట్‌ ఇదే..!

Boyapati Srinu: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తే చాలు ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనేది సినీ ప్రేక్షకుల నమ్మకం.

Arun Chilukuri
Published on: 16 April 2024 5:07 PM IST
Boyapati Srinu Gives Update About Akhanda 2
X

Akhanda 2: అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. కాన్సెప్ట్‌ ఇదే..!

Boyapati Srinu: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తే చాలు ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనేది సినీ ప్రేక్షకుల నమ్మకం. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు కూడా అఖందమైన విజయాలను సాధించాయి. ప్రస్తుతం వరస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోసారి ఎప్పుడు బోయపాటితో సినిమా చేస్తారు అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అఖండ 2 తీయబోతున్నానని గత కొద్ది రోజుల క్రితమే బోయపాటి చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంపై ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని అన్నారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story