Boyapati Srinu: రామ్ సినిమా కోసం పందెంకోడి హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న బోయపాటి

Boyapati is Bringing The Heroine of Pandemkodi For The Movie Ram
x

Boyapati Srinu: రామ్ సినిమా కోసం పందెంకోడి హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్న బోయపాటి

Highlights

Boyapati Srinu: స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

Boyapati Srinu: స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బోయపాటి శ్రీను రామ్ పోతినేని హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లను ఎంపిక చేయాలని బోయపాటి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ ఈ మధ్యకాలంలో వెండితెరపై కనిపించింది లేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం మీరా జాస్మిన్ ను రంగంలోకి దింపుతున్న ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బోయపాటి శ్రీను ని దర్శకుడిగా మార్చిన "భద్ర" సినిమాలో కూడా మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బోయపాటి సినిమాలో ఆఫర్ అంటే మీరా కూడా ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఆమె కి ఒక గ్లామరస్ పాత్ర దొరికిందా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిననుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories