సింగర్ కేకే అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరం.. బౌన్సర్స్ ఫోమ్ స్ప్రే చేశారంటున్న హోటల్ స్టాఫ్..

సింగర్ కేకే అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరం..
KK Death News: ప్రముఖ పాపులర్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే అతి చిన్నవయసులోనే ఈ లోకాన్ని వీడిపోయారు.
KK Death News: ప్రముఖ పాపులర్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే అతి చిన్నవయసులోనే ఈ లోకాన్ని వీడిపోయారు. ఆరాధ్య దైవమైన గానం అనే వృత్తిలో లీనమైన సమయంలోనే దిగంతాలకు వెళ్లిపోయారు. ప్రముఖ గాయకుడిగా దేశ ప్రజలందరి చేత ప్రశంసలందుకుంటున్న వేళ 53 ఏళ్లకే శాశ్వతంగా కన్నుమూయడం అభిమానులను బాధిస్తోంది. అయితే కేకే చనిపోయిన పరిస్థితులు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయి.
బెంగాల్ కు చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో కచేరీ నిర్వహిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 2500 నుంచి 3 వేల మంది వరకు మాత్రమే కెపాసిటీ గల నజ్రుల్ మంచా ఆడిటోరియంలో దాదాపు 6 వేల మంది ప్రేక్షకులను అలో చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడిటోరియంలో ఏసీ ఉన్నా కూడా అది సరిపోలేదని ప్రత్యక్ష సాక్షులు, ఆడిటోరియం స్టాఫ్ అంటున్నారు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి కేకే నియమించుకున్న బౌన్సర్లు ఫోమ్ సిలిండర్స్‌ను స్ప్రే చేశారని, వాటి నుంచి వచ్చిన పొగతో కేకే చాలా ఇబ్బంది పడ్డాడని అంటున్నారు.
శ్వాసతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తడం వల్లే కచేరీని మధ్యలోనే ఆపేసి హోటల్ కు వెళ్లిపోయాడంటున్నారు. హోటల్లో కూడా రూమ్ కు చేరుకోక ముందే చాలా ఇబ్బంది పడ్డాడని, అయినా కొందరు ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగాడంటున్నారు. ఇక హోటల్ గదిలోకి వెళ్లిపోయాక కుప్పకూలిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మరోవైపు కేకే మరణంపై బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని, రవీంద్ర సదన్ లో రైఫిల్ సెల్యూట్ ఉంటుందని మమత చెప్పారు.
కృష్ణకుమార్ కున్నత్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్ పాటలు ఆలపించగా రెండు సూపర్ హిటయ్యాయి. ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్, నువ్వేనువ్వే, సైనికుడుతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడారు కేకే .
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMT