Boney Kapoor: జాన్వీ కపూర్ కి టాలీవుడ్ వద్దని చెబుతున్న బోనీకపూర్

Boney Kapoor: జాన్వీ కపూర్ ని టాలీవుడ్ లో ఎంటర్ అవ్వకుండా ఆపేస్తున్న బోనీకపూర్

admin1
Updated on: 18 Nov 2021 4:00 PM IST
Boney Kapoor stops Janhvi Kapoor From Entering Tollywood
X

జాన్వీ కపూర్ కి టాలీవుడ్ వద్దని చెబుతున్న బోనీకపూర్ (ఫైల్ ఇమేజ్) 

Boney Kapoor: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" సినిమా ని నిర్మించిన బోనీకపూర్ తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు గీత ఆర్ట్స్ సంస్థలతో చేతులు కలిపి హిందీ లో సూపర్ హిట్ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం బోనీకపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎప్పుడు తెలుగులో పరిచయం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న అనన్య పాండే ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "లైగర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పలు టాలీవుడ్ నిర్మాతలు మరియు డైరెక్టర్లు జాన్వీకపూర్ ను తెలుగులో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ బోని కపూర్ మాత్రం జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంటర్ అయ్యి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కంటే బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story