శ్రీదేవి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న బోనీ

Ruthvik
Published on: 5 May 2019 2:49 PM IST
శ్రీదేవి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న బోనీ
X

అర్ధాంతరంగా అలనాటి తార శ్రీదేవి ఆకస్మిక మరణం కేవలం అభిమానులను మాత్రమే కాక కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా కలచి వేసింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోవడానికి అభిమానులకే చాలాకాలం పట్టింది కానీ ఆమె భర్త బోనీ కపూర్ మాత్రం ఇంకా ఆమె మరణం నుంచి బయటకు రాలేక పోతున్నారు. తాజాగా ఒక టాక్ షోలో కనిపించిన బోనీకపూర్ శ్రీదేవి టాపిక్ వచ్చిన వెంటనే కన్నీరు కార్చేశారు. 'ఔర్ ఏక్ కహానీ' అనే టాక్ షోలో పాల్గొన్న బోనీకపూర్ ను శ్రీదేవి గురించి ప్రశ్నించగా ఆయన ఎమోషనల్ అయ్యారు.

ఆ వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీదేవి మరణంను తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లుగా బోణీకపూర్ కన్నీరు పెట్టుకుంటూ చెప్పడం అందరి హృదయాలను కరిగిస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24 వ తేదీ దుబాయ్ లోని ఒక హోటల్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆఖరిసారిగా 'జీరో' సినిమాలో గెస్ట్ అప్పీరన్స్ ఇచ్చారు. ఇక ఆమె వారసులుగా ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్ మరియు కుషి కపూర్ కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story