Geetha Arts: తక్కువ రెమ్యునరేషన్ కి హిట్ డైరెక్టర్ ని పట్టిన గీతాఆర్ట్స్

Geetha Arts: అఖిల్ సినిమా కోసం నెల జీతానికి పని చేసిన దర్శకుడు

admin1
Updated on: 21 Oct 2021 9:18 PM IST
Bommarillu Bhaskar Worked as Salaried Employee to Most Eligible Bachelor Movie
X

బొమ్మరిల్లు భాస్కర్ (ఫైల్ ఇమేజ్)

Geetha Arts: ఈ మధ్యకాలంలో హీరోలతో సమానంగా డైరెక్టర్లు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్క సినిమా హిట్టయితే చాలు దర్శకులు కూడా జీతాన్ని అమాంతంగా పెంచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఒక దర్శకుడి ని తక్కువ బడ్జెట్ కే పట్టేసింది. ఈ మధ్యనే గీత ఆర్ట్స్ నిర్మించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. అఖిల్ అక్కినేని మరియు పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా దర్శకత్వం వహించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ కేవలం నెల జీతానికి మాత్రమే పనిచేశారట. ఆయనకు నెలకు కేవలం రెండు లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చేవారని సమాచారం. "బొమ్మరిల్లు" లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఖాతాలో ఉన్నప్పటికీ గీతా ఆర్ట్స్ వారు భాస్కర్ ని తక్కువ జీతానికి పట్టేశారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు పారితోషికం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో సినిమా సూపర్ హిట్ అయితే నిర్మాతలు దర్శకులు కి భారీ గిఫ్ట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి గీత ఆర్ట్స్ వారు బొమ్మరిల్లు భాస్కర్ కి ఎలాంటి బహుమతి ఇస్తారో చూడాలి.

admin1

admin1

Next Story