Bhaskar - Orange Movie:"ఆరెంజ్" సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

* ఆ సినిమా ఇప్పుడు విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్న బొమ్మరిల్లు భాస్కర్

admin1
Updated on: 24 Sept 2021 8:31 PM IST
Bommarillu Bhaskar says that Ram Charan Orange Movie will be a Blockbuster if it is Released Now
X

బొమ్మరిల్లు భాస్కర్ (ఫైల్ ఫోటో)

Bhaskar - Orange Movie: "బొమ్మరిల్లు" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న భాస్కర్ ఆ తరువాత "పరుగు" సినిమాతో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు. ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన "ఆరెంజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు భాస్కర్.

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ "ఆరంజ్" సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను బయటపెట్టారు.

"ఆరెంజ్" సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కి వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతూ నాగబాబు ఆ సమయంలో తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కానీ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఆయనకి తోడుగా నిలబడ్డారు అని చెప్పిన సంగతి తెలిసిందే ఈ విషయమై మాట్లాడుతూ "ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇప్పటికీ కొంత మంది అభిమానుల దృష్టిలో ఆరెంజ్ సినిమా ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయింది.

ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. సినిమా గురించిన ఏ కామెంట్ ని కూడా అతిశయోక్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా నాగబాబు మరియు రామ్ చరణ్ మరియు మెగా ఫ్యామిలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు," అని అన్నారు బొమ్మరిల్లు భాస్కర్.

admin1

admin1

Next Story