మహేష్ బాబు సినిమాతో మళ్లీ మెప్పించనున్న బాలీవుడ్ సింగర్

*మహేష్ బాబు సినిమాతో మళ్లీ మెప్పించనున్న బాలీవుడ్ సింగర్

admin1
Updated on: 20 April 2022 2:00 PM IST
Bollywood singer Armaan Malik in Mahesh Babu Movie
X

మహేష్ బాబు సినిమాతో మళ్లీ మెప్పించనున్న బాలీవుడ్ సింగర్

Armaan Malik: ఈ మధ్యకాలంలో ఇతర భాషల నుంచి పలు సింగర్లు తెలుగులో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అందులో సిద్ శ్రీరామ్ కూడా ఒకరు. అయితే తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు ఒక ప్రముఖ బాలీవుడ్ సింగర్ కూడా చేరిపోయారు. అతను మరెవరో కాదు అర్మాన్ మాలిక్. అల్లు అర్జున్ హీరోగా నటించిన "అల వైకుంఠ పురం లో" సినిమా లో "బుట్ట బొమ్మ" పాట తో ప్రేక్షకులను బాగా మెప్పించిన అర్మాన్ మాలిక్ గతంలో కూడా "తొలిప్రేమ" సినిమాలో "నిన్నిలా నిన్నిలా" పాట, "అరవింద సమేత" సినిమాలో "అనగనగా" పాట, "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో "గుచ్చే గులాబీ" పాటలతో చార్ట్ బస్టర్ లు అందుకున్నారు అర్మాన్ మాలిక్.

ఇప్పటికే తెలుగులో ఈ ప్రముఖ బాలీవుడ్ సింగర్ 30 కి పైగానే పాటలను పాడారు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కూడా అర్మాన్ మాలిక్ ఒక అద్భుతమైన పాట ను పాడారు. కానీ ఇంకా ఆ పాట విడుదల కావాల్సింది. ఇప్పటికే చాలా మంది మహేష్ బాబు అభిమానులు అర్మాన్ మాలిక్ కు తన పాటని ఎప్పుడు విడుదల చేయనున్నారు అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ అభిమానులతో పాటు తాను కూడా ఆ పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు అర్మాన్ మాలిక్.

admin1

admin1

Next Story