Chiranjeevi: చిరు సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

Bollywood Senior Heroine In Chiranjeevi Movie
x

చిరు సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

Highlights

మెగాస్టార్ చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్‌లో ఒకప్పుడు అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న రాణి ముఖర్జీ.

భోళాశంకర్ పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్‌లో పెట్టారు. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ కథలను ఎక్కువగా వింటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. చిరు. శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్రాజెక్ట్‌పై లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో రాణి ముఖర్జీ నటించనున్నట్టు తెలుస్తోంది. మెగా స్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాని గతంలో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్ పెంచారు.

అయితే ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యత ఇస్తోందని సమాచారం. ఆ పాత్రకు రాణి ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని చిరుతో చెప్పగా ఆయన కూడా ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

చిరు, శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాని ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. నాని సమర్పిస్తున్న కోర్ట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు-ఓదెల సినిమా గురించి ప్రశ్నించగా నెక్ట్స్ ఇయర్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం యునానిమస్ అనే కొత్త బ్యానర్‌ను కూడా ఓపెన్ చేశారు.

అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు ఓ సినిమా కమిట్ కావడం, బాబీ కొల్లి డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తారని వార్తలు రావడంతో ఓదెల సినిమా ఎప్పుడు ఉంటుందా..? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మూవీ 2026లో ఉంటుందని నాని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో ది ప్యారడైజ్ అనే మూవీ రూపొందుతోంది. దీని తర్వాతనే చిరంజీవి సినిమా పనులు మొదలుకానున్నాయి.

చిరంజీవితో శ్రీకాంత్ చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌తో ఇదొక మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్పకనే చెప్పారు. మెగాస్టార్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో స్పెషల్‌గా, డిఫరెంట్‌గా ఉంటుందని ఆయన క్యారెక్టర్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అన్నారు. ఈ సినిమాలో చిరుని కొత్త లుక్‌లో చూడబోతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories