Wajid Khan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో సంగీత దర్శకుడు మృతి

Wajid Khan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. కరోనాతో సంగీత దర్శకుడు మృతి
x
bollywood music director wajid khan(file phoo)
Highlights

ఈ ఏడాది బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ఏడాది బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) మే 31వ తేదీ (ఆదివారం) రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే కరోనా వైరస్ కూడా సోకడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్ ఫేమ‌స్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన వాజిద్ ఖాన్ మరణం హిందీ విషాద ఛాయలు నింపింది. సాజిద్-వాజిద్ ద్వయం పలు హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు. సల్మాన్ ఖాన్ సినిమాలకు ''వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్'' తదితర చిత్రాలకు ఈ ద్వయమే సంగీతం సకూర్చారు. వాజిద్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు.

ప్రియాంకచోప్రా విచారం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ట్వీట్ చేశారు ''వాజిద్ ఖాన్ మీ నవ్వు మేమెప్పుడూ మర్చిపోలేం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వాజిద్ ఖాన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా'' అని ట్వీట్ చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
Next Story
More Stories