ప్రభాస్ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ

*ప్రభాస్ సినిమా ఈ బాలీవుడ్ భామ కరియర్ ను కాపాడగలదా?

Jyothi
Updated on: 20 Feb 2023 8:00 PM IST
Bollywood Heroine Has Hope on Prabhas Film
X

ప్రభాస్ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ

Kriti Sanon: ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమా లతో నంబర్ వన్ హీరోయిన్ గా మారిన కృతి సనన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత "పానిపట్" అనే సినిమాతో కృతి సనన్ బ్యాడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుంచి కృతి నటించిన "హమ్ దో హమారా దో", "బచ్చన్ పాండే", "బేడియా" వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఈమధ్యనే కార్తిక్ ఆర్యన్ హీరోగా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన "అల వైకుంఠపురం లో" సినిమా హిందీ రీమేక్ అయిన "షెహజాదా" పైన హోప్స్ పెట్టుకుంది ఈ భామ కానీ ఈ సినిమాకి కూడా అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. మధ్యలో "మీమీ" అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి కానీ ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలలోనే విడుదలైంది. ఈ నేపథ్యంలో కృతి సనన్ తన ఆశలన్నీ ఇప్పుడు ప్రభాస్ "ఆది పురుష్" సినిమా పైనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏదేమైనా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కారణంగా సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి ప్రభాస్ బ్రాండ్ కారణంగా అయినా కృతి సనన్ హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. మరో వైపు కృతి సనన్ టైగర్ ష్రాఫ్ సరసన "గణపత్" అనే సినిమాలో కూడా నటిస్తోంది.

Jyothi

Jyothi

Next Story