Mahesh Babu New Movie: మహేష్ బాబు అత్తగా శిల్పా శెట్టి!

Bollywood Actress Shilpa Shetty Plays a Mother in Law Role in Mahesh Babu New Movie
x

శిల్పా శెట్టి, మహేశ్ బాబు (ఫొటో ట్విట్టర్)

Highlights

Mahesh Babu New Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu New Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో లో మూడో సినిమా గా రానున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి. కాగా, వీరి కాంబో మొదటి సినిమాగా అతడు, మలి సినిమాగా ఖలేజా అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా '#SSMB28' గా పేరు పెట్టిన (వర్కింగ్ టైటిల్) ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర గురించి సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.

మాములుగా త్రివిక్రమ్ సినిమాలో ఓ బలమైన లేడీ పాత్ర కనిపిస్తుంది. అయితే, ఈ సినిమాలోనూ ఓ కీలక పాత్ర కోసం శిల్పా శెట్టి ని తీసుకోనున్నారని సమాచారం. శిల్పా శెట్టి ఈ మూవీలో మహేష్ బాబుకు అత్తగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత శిల్పా శెట్టి టాలీవుడ్‌ లో అడుగు పెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వార్తపై అధికారిక సమాచారం తెలియనుంది.

ప్రస్తుతానికైతే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో స్పష్టత లేదు. కాగా, మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories