Kriti Sanon: ఏమాత్రం మనస్సాక్షి లేదా అని ప్రశ్నిస్తున్న కృతి సనన్

* మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టార్ హీరోయిన్

admin1
Updated on: 9 Oct 2021 12:19 PM IST
Bollywood Actress Kriti Sanon Fired on Media Photographers Behavior at the Sidharth Shukla Funeral
X

కృతి సనన్ (ట్విట్టర్ ఫోటో)

Kriti Sanon: ఈ మధ్యనే విడుదలైన "మీమి" సినిమాతో సూపర్ హిట్ అందుకుంది కృతి సనన్. సరగసీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా కృతి సనన్ మీడియా గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీడియా వైఖరితో తను ఏమాత్రం సంతోషంగా లేదని చెప్పుకోచ్చింది కృతి. ముఖ్యంగా సిద్ధార్థ్ శుక్ల అంత్యక్రియల విషయంలో మీడియా తీరు ఏమాత్రం బాగాలేదు అని ఆమె అన్నారు. ఇంస్టాగ్రామ్ లో తన పోస్టు ద్వారా మీడియా గురించి మాట్లాడుతూ పెదవి విరిచారు కృతి.

"అసలు మనస్సాక్షి అనేది లేకుండా మీడియా ఫోటోగ్రాఫర్లు మరియు ఆన్లైన్ పోర్టల్స్ వైఖరి చూస్తుంటే నా మనసు విరిగిపోతుంది. ఇది మీడియాకి సిగ్గుచేటు. ఇది న్యూస్ కాదు. ఎంటర్టైన్మెంట్ కాదు. దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంత్యక్రియలను కవర్ చేయడం ఆపేయాలి. కుటుంబంలో మనిషిని పోగొట్టుకున్న వారి మొహాల ముందు కెమెరా ఫ్లాష్ చేయాల్సిన అవసరం ఏముంది. కేవలం కొన్ని పోస్టుల కోసమా? ఆన్లైన్ పోర్టల్స్ మరియు న్యూస్ చానల్స్ కూడా ఇవే తప్పు చేస్తున్నాయి. ఇలాంటివి ఆపేయండి," అంటూ స్ట్రాంగ్ గా బోల్డ్ కామెంట్స్ చేసింది కృతి సనన్.

admin1

admin1

Next Story