Bollywood: రోజుకు 8సార్లు తినడమే ఆమె అందం వెనుక అసలు రహస్యమట!

Kareena Kapoor Fitness
x

కరీనా కపూర్ ఫైల్ ఫోటో 

Highlights

Bollywood: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లందరూ ఫిట్ నెస్ విషయంలోనూ.. గ్లామర్ విషయంతో చాలా జాగ్రత్తగా ఉంటారు.

Bollywood: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లందరూ ఫిట్ నెస్ విషయంలోనూ.. గ్లామర్ విషయంతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. బొద్దుగా ఉంటే ఛాన్స్ లు రావేమో అనే ఉద్దేశ్యంలో జీరో సైజ్ లోకి మారిపోతుంటారు. ఈ క్రమంలో రోజుకు 2సార్లు మాత్రమే ఆహారం తినే హీరోయిన్లు కోకొల్లలు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న వేళ.. రోజుకు ఏకంగా 8సార్లు ఆహారం తీసుకునే హీరోయిన్లు ఉంటారా? కచ్చితంగా ఉంటారు.. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బెబో కరీనా కపూర్.

కరీనా ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికీ ఆమెలో అదే అందం, అదే ఎట్రాక్షన్, అదే ఫిజిక్ మారలేదు. కరీనా డైట్ ఏంటనే విషయాన్ని ఆమె న్యూట్రిషనిస్ట్ బయటపెట్టింది. మితంగా ఎక్కువసార్లు తినడం, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం కరీనా కపూర్ సీక్రెట్ గా చెప్పుకొచ్చింది. ఉదయాన్నే కుంకుమ పువ్వుతో కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది కరీనా. ఇది బ్రేక్ ఫాస్ట్ కాదు, లేచిన వెంటనే తినేది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో అందరిలానే పరాఠా-చట్నీ తింటుంది. లంచ్ కు ముందు కొన్ని సబ్జా గింటలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్న భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం మాత్రమే.

ఇక వ్యాయామాల విషయంలో కూడా కరీనా చాలా పద్ధతిగా ఉంటుంది. అంతా అనుకుంటున్నట్టు ఆమె రోజులో గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేయదు. వారానికి 10 గంటలు మాత్రమే వ్యాయామాలు చేస్తుంది. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తింటుంది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్ తాగుతుంది. ఇక రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తీసుకుంటుంది. పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగుతుంది కరీనా. ఇలా రోజులో 8సార్లు ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ..తన అందాన్ని కాపాడుకుంటుంది కరీనా కపూర్.

Show Full Article
Print Article
Next Story
More Stories