Esha Gupta: క్యాస్టింగ్ కౌచ్ విషయంలో షాకింగ్ కామెంట్లు చేసిన ఈషా గుప్తా

* తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటున్న రామ్ చరణ్ హీరోయిన్

admin1
Updated on: 30 Oct 2021 2:00 PM IST
Esha Gupta: క్యాస్టింగ్ కౌచ్ విషయంలో షాకింగ్ కామెంట్లు చేసిన ఈషా గుప్తా
X

Esha Gupta: ఇండస్ట్రీలో ఉన్న బోల్డ్ నటీమణులలో ఈషా గుప్తా కూడా ఒకరు. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈషా గుప్తా ఎక్స్పోజింగ్ లో కూడా ముందే ఉంటుంది. సెక్స్ సైరన్ అనే ఇమేజ్ కూడా తెచ్చుకున్న ఈ భామ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్ లను చేసింది. ఆమె కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని అందరికీ షాక్ ఇచ్చింది ఈషా గుప్తా. వెండితెరపై అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని ఈ భామకి క్యాస్టింగ్ కౌచ్ ను ఒకసారి కాదు రెండుసార్లు ఎదుర్కొందట.

ఇద్దరు ఫిలిం మేకర్ లు ఆమెను తమతో ఒక రాత్రి గడపమని అడిగారట. అంతేకాకుండా ఒక సహనిర్మాత ఆమెను బలవంతం చేయబోతుండగా ఆమె అడ్డుకుందని ఆమెను సినిమాలో నుంచి తీసేశారట. ఇలా తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని చెప్పుకొచ్చింది ఈషా గుప్తా. బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో నటించిన "వినయ విధేయ రామ" సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కనిపించింది ఈ భామ. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఈమెకి తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.

admin1

admin1

Next Story