సమంత స్థానాన్ని తీసుకోబోతున్న బాలీవుడ్ బ్యూటీ...

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈమధ్య ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది...

admin1
Updated on: 24 March 2022 6:13 PM IST
Bollywood Actress Disha Patani Replacing Samantha in Pushpa The Rule Movie Item Song
X

సమంతా స్థానాన్ని తీసుకోబోతున్న బాలీవుడ్ బ్యూటీ...

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈమధ్య ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటెం సాంగ్ తో బన్నీతో కలిసి స్టెప్పులేసి అందరికీ షాక్ ఇచ్చింది సమంత. కొద్దిరోజుల్లోనే యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ ను అందుకుని రికార్డులు సృష్టించింది ఈ పాట.

తన హాట్ స్టెప్పులతో సమంత తనలోని ఒక కొత్త యాంగిల్ ను బయట పెట్టింది అని చెప్పవచ్చు. ఇక ప్రేక్షకులందరూ పుష్ప రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం సమంతాని తీసుకోవడం లేదట. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ని రంగంలోకి దిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన "లోఫర్" సినిమా లో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దిశా పటాని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా చలామణి అవుతోంది.

తాజాగా ఇప్పుడు ఈమెను పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్ కోసం సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. చెప్పాలంటే సమంత కన్నా దిశాపటాని అందాల ఆరబోతలో ముందుంటుంది. కానీ సమంత అభిమానులు మాత్రం సమంతా కి కాకుండా వేరొకరిని తీసుకున్నందుకు దర్శక నిర్మాతలపై మండిపడుతోనట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకనిర్మాతలు ముందు సమంతనే సంప్రదించారని కానీ సమంతానే ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


admin1

admin1

Next Story