SSMB28: మహేష్ బాబు కోసం టాలీవుడ్ లో అడుగు పెట్టనున్న బాలీవుడ్ భామ

మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్ర

Arun Chilukuri
Published on: 22 Feb 2023 1:01 PM IST
Bollywood Actress Bhumi Pednekar In Mahesh Babu SSMB28
X

SSMB28: మహేష్ బాబు కోసం టాలీవుడ్ లో అడుగు పెట్టనున్న బాలీవుడ్ భామ

SSMB28: గతేడాది మొదట్లో "సర్కారు వారి పాట" సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూడవ సినిమా గా తెరకెక్కనుంది. గతంలో వీరి కాంబో లో వచ్చిన "అతడు", "ఖలేజా" లు బ్లాక్ బస్టర్ లు కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్‌ కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోని "గోవింద నామ్ హై మేరా" లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన భూమి మహేష్ బాబు సరసన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుందట. తాజాగా ఈమె ఈ సినిమాలో ఒక లేడీ కానిస్టేబుల్‌గా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ తో పాటు మరొక హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉండే రోల్ ఉంటుంది. "అరవింద సమేత", "అల వైకుంఠపురములో" సినిమాలలో కూడా త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, భూమి పెడ్నేకర్ ఈ సినిమాలో నటిస్తుంది అనే వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. శ్రీ లీల కూడా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా, జగపతి బాబు మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. థమన్ ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story