సోనూసూద్ కి అరుదైన గౌరవం..

సోనూసూద్ కి అరుదైన గౌరవం..
x
Highlights

ముంబైకి చెందిన ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి సమాజసేవ అంటే చాలా ఇష్టం. కానీ తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నారో అందరికి తెలిసిందే. లాక్ డౌన్ వలన పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు ఆదుకొని వారి పాలిట దేవుడి లాగా నిలిచాడు సినీ నటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. అయితే ఇంత చేసిన సోనూసూద్ కి ఏ ప్రభుత్వం కూడా సత్కారాలు చేయలేదు.

అయితే తాజాగా సోనూసూద్ కి ఓ అరుదైన అవార్డు దక్కింది. అయితే సోనూసూద్ కి ఇచ్చింది ఓ పెద్ద కంపెనీ కాదు.. ఓ సామాన్యుడు కావడం విశేషం. అవును మరి.. ముంబైకి చెందిన ఇంద్రోజిర రమెష్ అనే వ్యక్తి ఓ కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి సమాజసేవ అంటే చాలా ఇష్టం. కానీ తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. దీనితో ఎవరైనా ఎవరైన ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే వారిని ప్రతిమను తయారు చేసి వారికి అందిస్తుంటాడు. దానికి పద్మ సేవ అనే పేరు పెట్టుకున్నాడు.

అందులో భాగంగానే తానే స్వయంగా తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ తో వెళ్లి సోనూసూద్ ను అందించి చిరు సత్కారం చేశాడు. ఈ సత్కారాన్ని సోనూసూద్ కూడా అంగీకరించాడు.రమేష్‌ ఇప్పటి వరకు 95 మందికి పైగా వీటిని అందుకున్నారు అందులో దర్శకుడు లారెన్స్, నటి మంచు లక్ష్మి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories