Sanjay Dutt: మహేష్ బాబు సినిమాలో స్టార్ బాలీవుడ్ నటుడు

* మహేష్ బాబు కోసం రాజకీయ నాయకుడిగా మారబోతున్న బాలీవుడ్ నటుడు

admin1
Updated on: 9 Oct 2021 11:51 AM IST
Bollywood Actor Sanjay Dutt Playing Politician Character in Trivikram Mahesh Babu Movie
X

మహేష్ బాబు - సంజయ్ దత్ 

Sanjay Dutt: మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. "అతడు", "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ పాత్ర కోసం నభ నటేష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ బాలీవుడ్ నటుడు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరో కాదు సంజయ్ దత్. బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన సంజయ్ దత్ మహేష్ బాబు సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారట. ఆయన పాత్ర సినిమాకి చాలా ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. "పార్ధు", "అతడే పార్ధు" వంటి టైటిల్స్ ను ఈ సినిమాకి అనుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం త్వరలో వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామా అని వార్తలు వినిపిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story