క్యాన్సర్‌ను జయించిన హీరో సంజయ్ దత్

Arun Chilukuri
Published on: 22 Oct 2020 8:23 AM IST
క్యాన్సర్‌ను జయించిన హీరో సంజయ్ దత్
X

బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్ క్యాన్సర్‌ను జయించారు. పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఇదేనంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇక కేజీఎఫ్ 2లో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ప్రకటించాడు. సంజయ్ దత్ పోస్టును షేర్ చేస్తున్న అభిమానులు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story