Adipurush Movie: "ఆది పురుష్" విషయంలో ఆ ఛాన్స్ లేదు అంటున్న బాలీవుడ్ నటుడు

* ఇది థియేటర్లలో మాత్రమే చూడదగ్గ సినిమా * ఈ సినిమా థియేటర్లో తప్ప ఇంకెక్కడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు

admin1
Updated on: 8 Oct 2021 6:23 PM IST
Bollywood Actor Saif Ali Khan Said Adipurush Movie Will be Released only in Theatres
X

ఆదిపురుష్ సినిమా(ఫోటో-ది హన్స్ ఇండియా)

Saif Ali Khan - Adipurush Movie: "బాహుబలి" సినిమా తో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు "రాధేశ్యామ్" సినిమా త్వరలో విడుదల కాబోతోంది. మరోవైపు ప్రభాస్ "సలార్" మరియు "ఆదిపురుష్" సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఆది పురుష" సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా మైతలాజికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా లో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. సీత పాత్రలో కృతిసనన్ కనిపించనుందట. ఇక రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడారు సైఫ్. ఈ మధ్యనే "భూత్ పోలీస్" సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సైఫ్ అలీఖాన్ ప్రమోషన్స్లో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ "ఆది పురుష్" గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా క్వాలిటీ విషయంలో ఓం రౌత్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరని, అయితే ఇది థియేటర్లలో మాత్రమే చూడదగ్గ సినిమా అని అన్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్లో తప్ప ఇంకెక్కడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు అని ఖరాఖండిగా చెప్పారు. ఇక ఈ సినిమా విడుదల అవ్వాలంటే పరిస్థితులు పూర్తిగా చక్కబడాల్సిందే అని అందరూ అనుకుంటున్నారు.

admin1

admin1

Next Story