logo

అవతార్ టైటిల్ నేనే ఇచ్చాను .. బాలీవుడ్ నటుడు ..

అవతార్ టైటిల్ నేనే ఇచ్చాను .. బాలీవుడ్ నటుడు ..
Highlights

సినీ ప్రేక్షకులకు అవతార్ సినిమా గుర్తుండే ఉంటుంది . జామ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ...

సినీ ప్రేక్షకులకు అవతార్ సినిమా గుర్తుండే ఉంటుంది . జామ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులిపింది . అయితే ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు గోవింద ఆసక్తికర వాఖ్యలు చేసారు . ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని దర్శకుడు జామ్స్ కామెరూన్ కి నేనే సజ్జెస్ట్ చేసానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

అదే ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు .ఇదే సినిమాలో జామ్స్ కామెరూన్ తనకి ఓ పాత్ర ఇచ్చాడని దానికోసం 410 రోజుల డేట్స్ కావాలని కోరాడని కానీ నేను రిజెక్ట్ చేసానని చెప్పుకొచ్చాడు . ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అవతార్ సినిమా వచ్చిన మూడేళ్ళకు అంటే 2012 లో గోవింద హిందీలో అవతార్ సినిమా చేసాడు కానీ అది విడుదలకు నోచుకోలేదు . అయితే గోవింద చేసిన వాఖ్యలపై నెటిజన్లు కౌంటర్లు పేలుస్తున్నారు .



లైవ్ టీవి


Share it
Top