Prabhas: ప్రభాస్ కోసం దయ్యంగా మారనున్న బాలీవుడ్ నటుడు...

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలానే బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే...

admin1
Updated on: 28 March 2022 2:15 PM IST
Bollywood Actor Boman Irani Doing Ghost Character in Prabhas New Movie | Live News
X

Prabhas: ప్రభాస్ కోసం దయ్యంగా మారనున్న బాలీవుడ్ నటుడు...

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలానే బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్ లో "ఆది పురుష్", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్టు కే", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే.

"రాజా డీలక్స్" అనే టైటిల్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇదోక హార‌ర్ కామెడీ సినిమా అని వార్త‌లొస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రభాస్ హారర్ జోనర్ లో సినిమా చేసింది లేదు. తాజాగా సినిమాలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బొమ‌న్ ఈ సినిమాలో దెయ్యంగా క‌నిపిస్తార‌ని టాక్ నడుస్తోంది. ఓ ఇంటి చుట్టూ చిత్ర క‌థ న‌డుస్తుంద‌ని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ఆ ఇంట్లోకి చేర‌తాడ‌ని, ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే క‌థ‌ అని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ గా వచ్చిన "ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌" అతి పెద్ద హిట్‌. ఈసారీ ప్ర‌భాస్ తో మారుతి అదే జోన‌ర్ లో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు.

admin1

admin1

Next Story