Hari Hara Veera Mallu: విలన్ ను రీప్లేస్ చేసిన హరిహర వీరమల్లు బృందం

Bobby Deol to play a Vilan Role in Hari Hara Veera Mallu
x

Hari Hara Veera Mallu: విలన్ ను రీప్లేస్ చేసిన హరిహర వీరమల్లు బృందం

Highlights

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం డేట్ల విషయంలో క్లాష్ రావటం వల్ల అర్జున్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక అర్జున్ రాంపాల్ సినిమా నుంచి వాకౌట్ చేసిన తర్వాత బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. సినిమా కథను విన్న వెంటనే బాబీ డియోల్ ఈ సినిమాలో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారం.

అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర కోసం జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె స్థానంలో నోరా ఫతేహి ఎంట్రీ ఇచ్చింది. 17వ సెంచరీ లో మొఘల్స్ పాలన సమయంలో సాగనున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది మొట్టమొదటి పీరియడ్ సినిమా కాబోతోంది. ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సమయంలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories