Hari Hara Veera Mallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్...

Hari Hara Veera Mallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్...

Arun Chilukuri
Published on: 10 Nov 2022 1:01 PM IST
Bobby Deol in Hari Hara Veera Mallu Movie
X

Hari Hara Veera Mallu: పవన్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్...

Hari Hara Veera Mallu: "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" వంటి సినిమాలతో బాగానే హిట్ సినిమాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. 2020 సెప్టెంబర్ లో మొదలైన ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏప్రిల్ 29 2022 న విడుదల కావాల్సిన సినిమా మళ్ళీ వాయిదా పడింది. ఒక వైపు రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్.

కానీ అలా అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోలందరూ బాలీవుడ్ హీరోలను తమ సినిమాలలో ముఖ్య పాత్రలలో తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ "గాడ్ ఫాదర్" సినిమాలో కనిపించగా ఇప్పుడు బాబి డియోల్ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story