Chadwick Boseman Dies : బ్లాక్ పాంధ‌ర్ న‌టుడు చాడ్విక్ బోస్మాన్ ఇక లేరు!

Chadwick Boseman Dies : హాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బ్లాక్ పాంధ‌ర్ న‌టుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూశారు.. అయన వయసు

Krishna
Updated on: 29 Aug 2020 11:26 AM IST
Chadwick Boseman Dies : బ్లాక్ పాంధ‌ర్ న‌టుడు చాడ్విక్ బోస్మాన్ ఇక లేరు!
X

Chadwick Boseman

Chadwick Boseman Dies : హాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బ్లాక్ పాంధ‌ర్ న‌టుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూశారు.. అయన వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు.. అయన మరణవార్తని అయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.. 'నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్‌ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్‌ కుటుంబం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నాలుగు సంవత్సరాలుగా చాడ్విక్ బోస్మాన్ పెద్దపేగు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఈ రోజు మృతి చెందారు. అయన మృతి పట్ల హాలీవుడ్ ప‌రిశ్రమ‌క ఘ‌న నివాళులు అర్పిస్తుంది.

ఇక బోస్‌మాన్‌ దక్షిణ కరోలినాలోని అండర్సన్‌లో పుట్టాడు.. 2016లో వచ్చిన కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి మంచి పేరును సంపాదించుకున్నాడు.. దీనితో బోస్‌మెన్‌​అతని ఇంటి పేరుగా మారింది. ఇక ఆ తర్వాత 2018 లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దర్శకుడు స్పైక్ లీ డా 5 బ్లడ్స్‌లో అతని చివరి సినిమా అని చెప్పాలి. ప్రస్తుతం అయన బ్లాక్ పాంథ‌ర్ సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో అయన మరణవార్త అందరిని కలిచివేసింది. అయితే కోవిడ్ కాలంలో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చాడ్విక్ ఓ వీడియో షేర్ చేయ‌గా అందులో ఆయన చాలా వీక్ గా క‌నిపించారు.



Krishna

Krishna

Next Story