ఖుష్బూకు తప్పిన భారీ ప్రమాదం!

ఖుష్బూకు తప్పిన భారీ  ప్రమాదం!
x
Highlights

ఈ ఘటనలో ఖుష్బూ కారు పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడంతో ఖుష్బూకు ముప్పు తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నైలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖుష్బూ కారు పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడంతో ఖుష్బూకు ముప్పు తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయవల్ల తానూ బతికి బయటపడ్డానని ఖుష్బూ ట్వీట్ చేసింది. కుష్బూ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాల గురించి పోలీసులు విచారిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories