logo

తేజ సినిమాలో బిత్తిరి సత్తి

తేజ సినిమాలో బిత్తిరి సత్తి
Highlights

కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న దర్శకుడు తేజ 2017 లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తో ఇండస్ట్రీలో మళ్ళీ...

కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న దర్శకుడు తేజ 2017 లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తో ఇండస్ట్రీలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ను అందుకున్నారు. తాజాగా 'సీత' అనే సినిమాతో త్వరలో మన ముందుకు రానున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తన కామెడీ టైమింగ్ కి మంచి పేరు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తన పాత్ర షూటింగ్ జరుగుతూ ఉంది. మోన్నారా చోప్రా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top