మరో బయోపిక్ తో నందమూరి హీరో

Ruthvik
Published on: 27 April 2019 10:36 AM IST
మరో బయోపిక్ తో నందమూరి హీరో
X

ఇండస్ట్రీ స్త్రాగులింగ్ హీరోలలో నందమూరి తారక రత్న కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. హీరో గా నందమూరి తారకరత్న ఇప్పటికే చాలాసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ తన కెరీర్ లో డిజాస్టర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా తారకరత్న ఇప్పుడు ఒక బయోపిక్ చేస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం నందమూరి తారకరత్న ఒక బయోపిక్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ లీడర్ దేవినేని నెహ్రూ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న సమయంలో దేవినేని నెహ్రూ మీద ఒక బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఆసక్తికరమైన వార్త ఏంటంటే దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న కనిపించబోతున్నాడు. గత కొంతకాలంగా డిజాస్టర్ లను అందుకుంటున్న తారకరత్న ఈ సినిమాపై తన ఆశలన్ని పెట్టుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. మరి ఈ సమయంలో నందమూరి తారక రత్నకు బయోపిక్ ఎంత వరకు కలిసి వస్తుందో అని అభిమానులు కూడా భయపడుతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Ruthvik

Ruthvik

Next Story