Bimbisara Director: ఒక్క హిట్టుకే మూడు కోట్లు..

Bimbisara Director Mallidi Vasishta Hikes Remuneration
x

Bimbisara Director: ఒక్క హిట్టుకే మూడు కోట్లు..

Highlights

Mallidi Vasishta: ఈమధ్య కాలంలో కేవలం ఒకే ఒక్క సినిమాతో యువ దర్శకులు మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు.

Mallidi Vasishta: ఈమధ్య కాలంలో కేవలం ఒకే ఒక్క సినిమాతో యువ దర్శకులు మంచి పేరు తెచ్చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న డైరెక్టర్ పేరు మల్లిడి వశిష్ట. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" సినిమాకి దర్శకత్వం వహించిన వశిష్ట మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే సోషియో ఫాంటసీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి చాలామందికి షాక్ ఇచ్చారు.

అసలు ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కూడా విశిష్టను ఆకాశానికి ఎత్తేశారు. అతను కచ్చితంగా ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడని జోష్యం కూడా చెప్పేశారు. నిజానికి ఈ సినిమా విడుదల కి ముందే గీత ఆర్ట్స్ వశిష్ట కు అడ్వాన్స్ ఇచ్చేసింది. అంతేకాకుండా మరో ఇద్దరు ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కూడా మల్లిడి విశిష్ట వెనక భారీ అడ్వాన్సులతో తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

కానీ గీత ఆర్ట్స్ తో సినిమా పూర్తయ్యే వరకు ఏ అడ్వాన్సులు తీసుకోనని వశిష్ట చెబుతున్నాడు. "బింబిసార" కి వశిష్ట అందుకున్న పారితోషికం చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కానీ సినిమాకి భారీ లాభాలు రావడంతో ఇప్పుడు సినిమాకి సీక్వెల్ కూడా తీయబోతున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కి వశిష్ట ఏకంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక కొత్త డైరెక్టర్ రెండవ సినిమాకే మూడు కోట్లు తీసుకోవటం నిజంగా విశేషమే.

Show Full Article
Print Article
Next Story
More Stories