Bimbisara Collections: దుమ్మురేపిన బింబిసార.. ఊహించని కలెక్షన్స్‌!

Bimbisara Day 2 Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు వెళుతోంది.

Arun Chilukuri
Published on: 7 Aug 2022 3:21 PM IST
Bimbisara Day 2 Box Office Collection Report
X

Bimbisara Collections: దుమ్మురేపిన బింబిసార.. ఊహించని కలెక్షన్స్‌!

Bimbisara Day 2 Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు వెళుతోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమా రెండో రోజు కూడా సత్తా చాటింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది.

ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బింబిసార' రెండు రోజుల కలెక్షన్స్‌..

► నైజాం - రూ. 3.92 కోట్లు

► సీడెడ్ - రూ. 2.24 కోట్లు

► ఈస్ట్ - రూ. 70 లక్షలు

► వెస్ట్ - రూ.55 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.1.55 కోట్లు

► గుంటూరు- రూ.89 లక్షలు

► కృష్ణా - రూ.59 లక్షలు

► నెల్లూరు - రూ.38 లక్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ. 0.50 లక్షలు

► ఓవర్సీస్‌ రూ.1.05 కోట్లు

► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్‌)

Arun Chilukuri

Arun Chilukuri

Next Story