డబుల్ బ్లాక్ బస్టర్.. "బింబిసార" మరియు "సీతారామం" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్..

Collection Report: ఈ శుక్రవారం అనగా ఆగస్టు 5 2022న రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 1:31 PM IST
Bimbisara and Sitharamam Day 1 Box Office Collection Report
X

డబుల్ బ్లాక్ బస్టర్.. "బింబిసార" మరియు "సీతారామం" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్..

Collection Report: ఈ శుక్రవారం అనగా ఆగస్టు 5 2022న రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో మొదటిది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార". మల్లిడి వసిస్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. క్యాథరిన్ తెరెసా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

కాగా మరొకటి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన "సీతారామం" సినిమా కూడా నిన్ననే విడుదలైంది. ఇక ట్రైలర్ మరియు ప్రమోషన్స్ తోనే ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. "సీతారామం" సినిమా మొదటి రోజున బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లను వసూలు చేసింది. రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా వారాంతం పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకునేలాగానే కనిపిస్తోంది.

మరోవైపు "బింబిసారా" సినిమా మొదటి రోజునే 45% రికవరీ పూర్తి చేసుకుంది. ఇక వారాంతం పూర్తయ్యాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. ఒకే రోజు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్నాయి. ఈసారి టాలీవుడ్ కి డబుల్ బ్లాక్ బస్టర్ వచ్చినట్లే చెప్పుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story